పాకిస్థాన్... ఎఫ్-16 వార్ ఫ్లైట్‌ను కూల్చిన భారత్

SMTV Desk 2019-02-27 13:29:26  Indian Fighter Jet, Pak Fighter Jet, Pilot, Collapsed

్రీనగర్, ఫిబ్రవరి 27: భారత సైన్యం మంగళవారం జరిపిన దాడి పట్ల ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్, తమ యుద్ధ విమానాలు భారత గగనతలంలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. దీంతో, అది వెనుదిరిగి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భారత్ లోని నౌషరా సెక్టార్ కు అవతలి వైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న లామ్ వ్యాలీలో 3 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్పకూలిపోయింది. విమానం నుంచి పైలట్ ప్యారాషూట్ ద్వారా కిందకు దిగుతుండటం కనిపించింది. ప్రస్తుతం పైలట్ పరిస్థితి తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు చోటుచేసుకోనున్నాయి.