పవన్ కళ్యాణ్ ఏమైనా పోటుగాడా: కౌశల్

SMTV Desk 2019-02-27 13:19:14  Koushal Koushal Army, Pawan Kalyan, Bigg Boss

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలుగు బిగ్ బాస్ రెండో సీజన్లో కౌశల్ తన అభిమానుల సహకారంతోనే షో లో చివరి వరకు ఉండి విజేతగా నిలిచాడు. ఆ షో రన్ అవుతున్న ఆ కొన్ని నెలలు కౌషల్ అనే పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. తాజాగా కౌషల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ కౌశల్ గురించి నమ్మలేని నిజాలు బయట పెట్టారు. కౌశల్ కి డబ్బు పిచ్చి అని ఇమామ్ ఆరోపించాడు. అయితే ఇది వరకు కౌషల్ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని చెప్పుకున్నాడు. దాంతో కౌషల్ గెలుపుకు కూడా పవన్ అభిమానుల మద్దతు కుడా తోడయింది.

కానీ ఇప్పుడు కౌశల్, పవన్ కళ్యాణ్ కు మర్యాద ఇవ్వకుండా మాట్లాడాడని కౌశల్ ఆర్మీలోని పవన్ కళ్యాణ్ అభిమానులు తెలిపారు. బిగ్ బాస్ అనంతరం విజయవాడలో అప్పుడే కొత్తగా ప్రారంభం అయిన నోవోటెల్ లో విజిట్ మీట్ కోసం రూమ్ బుక్ చెయ్యమన్నాడని అదేంటన్నా వేరే 5 స్టార్ హోటల్ లో బుక్ చేసాం,ఇందులో పవన్ కళ్యాణ్ కూడా దిగుతారు అని అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా పోటుగాడా నాకు ఇందులోనే బుక్ చెయ్యండి అంటూ పట్టుబట్టాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానిని అని చెప్పుకొని ఓట్లు వేయించుకొని గెలిచినా తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి అలా మర్యాద లేకుండా మాట్లాడేసరికి సాటి పవన్ అభిమానిగా తాను తట్టుకోలేకపోయానని ఇమామ్ తెలిపారు. అయితే ఇది ఎంతవరకు నిజమో కాదో తెలిదు. దీనిపై కౌశల్ స్పందన ఏంటో చూడాలి మరి.