స్పెషల్ గా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు: కేటీఆర్

SMTV Desk 2019-02-27 13:17:31  KTR, Telangana Bhavan, Chandrababu Naidu, Andhrapradesh, Elections

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇటీవల చంద్రబాబు చేసిన వాఖ్యలపై చాలా ఘాటుగా స్పందించారు. నీతిమాలిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు ఆరితేరారని, అసలు తనతో ఈ విషయంలో ఎవరు పోటీ పడలేరని వ్యాఖ్యానించారు.

ముసుగు తీసి ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, ముసుగు, కుట్ర, కుతంత్రాలకు మరో పేరు చంద్రబాబే అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ఆంధ్రా ప్రజలు తయారుగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీని ఓడించడానికి మేము స్పెషల్ ఏపీకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఏపీ ప్రజలే వారికి సరైన బుద్ది చెబుతారని కేటీఆర్ విమర్శించారు.