శింభుతో ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

SMTV Desk 2019-02-27 12:53:05  Shimbhu, Oviya, kollywood

చెన్నై, ఫిబ్రవరి 27: హీరోయిన్ ఓవియా ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆమె హీరో శింభుతో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ..స్నేహానికి .. ప్రేమకి మధ్య చాలా తేడా వుంది. శింబుకి .. నాకు మధ్య వున్నది స్నేహామే గాని ప్రేమకాదు" అని స్పష్టం చేసింది.

అంతేకాకండా శింభు తనకు మంచి స్నేహుతుడని ఆమె పేర్కొంది. "నా వ్యక్తిగత విషయాలను నేను తనతో షేర్ చేసుకుంటాను. ఆయన సలహాలు .. సూచనలు తీసుకుంటాను. ఏ సాయం కోసమైనా .. ఏ సమయంలోనైనా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు వుంది. ఎదుటివారి కష్ట సుఖాలను అర్థం చేసుకోగల మంచి మనసు శింబుకి వుంది. ఎదుటివారి సమస్యలకి తగిన పరిష్కారాలు సూచించగలగడంలో ఆయన ముందుటాడు. అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉండాలనే నేను కోరుకుంటున్నాను" అని ఓవియా వివరించింది.