పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశంసలు కురిపించారు. భారత బలగాల సామర్థ్యం భేష్ అంటూ కొనియాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ మెరుపు దాడి తర్వాత రాష్ట్రం అప్రమత్తమైనట్టు చెప్పారు. సరిహద

SMTV Desk 2019-02-27 11:37:34  Mohan Babu, Mahesh Babu, Ram Charan, Jr. NTR, Rajamouli, Fasak, Twitter

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఈ నెల 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిన్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడులు నిర్వహించింది. ఈ దాడి యావత్ దేశాన్ని సంతోషానికి గురిచేసింది. పాకిస్థాన్ బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కంట్రోల్ సెంటర్ పై దాడిచేసిన భారత యుద్ధ విమానాలు తక్కువ సమయంలోనే భారి నష్టం కలుగజేశాయి. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతులైనట్టు సమాచారం. కాగా, భారత్ నిర్వహించిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్ పై సెలబ్రిటీల నుంచి విశేష స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, రాజమౌళి తదితరులు భారత వాయుసేన తెగువకు సెల్యూట్ చేశారు.

తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా తనదైన శైలిలో స్పందించారు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సర్జికల్ స్ట్రయిక్స్ పై వ్యాఖ్యానించారు. "ఇన్నాళ్లకు ఫసక్ అంటే సరైన అర్థం లభించింది... ఫసక్ కు నిజమైన అర్థం ఇదే... జైహింద్! పదండి ముందుకు!" అంటూ ట్వీట్ చేశారు. మోహన్ బాబు ఓ సినిమాలో పలికిన ఊతపదమే ఫసక్ . కాగా, ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫినిష్ అనే అర్థంలో దీన్ని నెటిజన్లు విస్తారంగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు మోహన్ బాబు తన డైలాగ్ తోనే సర్జికల్ స్ట్రయిక్స్ పై స్పందించడం ట్విట్టర్ లో చాలామందిని ఆకర్షించింది.