ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో ఉగ్రవాదుల స్థావరాలు

SMTV Desk 2019-02-27 10:20:33  Balkot, Terrorists luxury, pakistan, India

పాకిస్తాన్, ఫిబ్రవరి 27:సాధారణంగా ఉగ్రవాదుల శిక్షణ శిబిరం అంటే కఠిన పరీక్షలకు నిలయంగా భావిస్తారు. కానీ బాల్ కోట్ లోని ఉగ్రవాద శిబిరం అందుకు పూర్తిగా భిన్నం. అక్కడ ఉగ్రవాదులకు సకల సదుపాయాలు ఉంటాయి. తరచూ ఉగ్రనేతలు రాకపోకలు సాగిస్తుండడం చేత బాలాకోట్ క్యాంప్ లో లగ్జరీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కుడా ఉంటుంది. పెద్ద సంఖ్యలో వంటవాళ్లు, సిబ్బంది ఉంటారు. దాదాపు ఆరేడు వందల మందికి సరిపడా ఆహారపదార్ధాలు నిత్యం తయారుచేస్తుంటారు. మొత్తమ్మీద ఈ స్థావరం ఓ టూరిస్ట్ హిల్ స్టేషన్ లా కనిపిస్తుంది.

మీడియా కథనాల ప్రకారం బాలకోట్ ఉగ్ర స్థావరం ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ కు దీటుగా ఉంటుంది. విలాసవంతమైన నివాస భవనాలు, వాటిలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ముఖ్యస్థావరం ఉగ్రవాదులకు స్వర్గధామం అని సమాచారం. అయితే, పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపుదాడుల్లో బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్రవాదులు, వారి శిక్షకులు మాంచి గాఢనిద్రలో ఉన్న సమయంలో భారత వాయుసేన స్వల్ప వ్యవధిలోనే పెను విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతులైనట్టు తెలుస్తోంది. వారిలో 27 మంది ట్రైనర్లు కూడా ఉన్నట్టు సమాచారం.