పాక్ లో భారత చలనచిత్రాలపై నిషేధం

SMTV Desk 2019-02-27 10:04:02  Pakistan banned Indian movies, Pakistan, Surgical Strike, fawad Choudary

పాకిస్తాన్, ఫిబ్రవరి 27: భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ ప్రభావం ఇప్పుడు చిత్ర పరిశ్రమపై కూడా పడింది. ఉగ్రవాదుల శిబిరాలపై భరత్ జరిపిన దాడితో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఉక్రోశంతో ఉంది. భారత్ దాడులను తిప్పికోట్టలేకపోయామన్న అసహనం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో భారత్ పై అక్కసుతో పాకిస్తాన్ లో భారతీయ చిత్రాలను నిషేదించారు. భారత సినిమాలే కాకుండా భారత్ లో రూపొందిన వాణిజ్య ప్రకటనలపైనా ఈ నిషేధం వర్తిస్తుందని పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌధరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ..."పాకిస్థాన్ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భారతీయ చిత్రాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకుంది. పాకిస్థాన్ లో ఇకపై ఏ భారతీయ చిత్రం రిలీజ్ కాదు. అలాగే భారత్ లో చిత్రీకరించిన యాడ్ ఫిలింస్ కూడా ప్రసారం చేయరాదని ఆదేశాలిచ్చాం" అని పేర్కొన్నారు.