హైదరాబాద్ లో హై అలర్ట్...!

SMTV Desk 2019-02-27 09:52:46  Hyderabad, high Alert, IB, Pakistan, Surgical Strike

హైదరాబాద్, ఫిబ్రవరి 27: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు జరగవచ్చని భావించిన ఐబీ అన్ని రాష్ట్రాల డీజీపీలను అలర్ట్‌ చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయి, అనుమానిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసారు. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని జన సందోషం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు జరగవచ్చన్న సమాచారంతో నిఘా పెంచిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఎప్పటికప్పుడు సమాచారాన్ని డీజీపీ కార్యాలయానికి చేరవేసింది.

అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లు, శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుతోపాటు పలు చోట్ల సీఆర్‌పీఎఫ్‌ బలగాలను మోహరించారు. స్లీపర్‌సెల్స్‌ దాడులు ఉంటాయన్న అనుమానంతో కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. నగరంలో స్లీపర్‌ సెల్స్‌ ఉన్నట్లు సమాచారం లేకున్నా.. ముందు జాగ్రత్తగా పకబడ్డందీ రక్షణ చర్యలు చేపట్టారు. జనసమ్మర్థ, సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు, అనుమానితులపై నిఘాను పెంచారు.