త్వరలో మార్కెట్లోకి 1టిబి మైక్రోఎస్‌డికార్డు

SMTV Desk 2019-02-26 18:34:01  Sandisk, 1TB Memory card, mobile world congress

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: చిప్‌లు, ఎస్‌డికార్డ్‌ల తయారీలో దిగ్గజ కంపెనీ శాండిస్క్‌ ఇప్పుడు మరో కొత్త ముందడుగు వేయబోతోంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఏ సంస్థ తయారుచేయలేని ఒక టిబి సామర్ధ్యం ఉన్న మైక్రోఎస్‌డి కార్డును మార్కెట్‌కు ప్రవేశపెడుతున్నది. మొన్న బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌లో ఈ కార్డును ప్రదర్శనకు తెచ్చింది. ఈ కార్డ్ వల్ల హై క్వాలిటీతో కూడిన ఫోటోలు, వీడియోలు స్మార్ట్‌ఫోన్లు, డ్రోన్లద్వారాను చిత్రించి నిక్షిప్తంచేసుకునే అవకావం కల్పిస్తోంది. యాక్షన్‌ కెమేరాలకుసైతం ఈ చిప్‌ అందుబాటులో ఉంటుంది. సెకనుకు 160 ఎంబి స్పీడుతో ఫైళ్లు ట్రాన్సఫర్‌చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఎంపికచేసిన రిటైలర్లవద్ద అందుబాటులో ఉంటుంది. ధర 499.99 డాలర్లుగా ఉంది. 512 జిబి కెపాసిటీ శాండిస్క్‌ ఎక్స్‌ట్రీమ్‌ కార్డులుసైతం అందబుటలోనికి వచ్చాయి. 199.99 డాలర్లుగా ఉంది.