గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు నోటాతోనే

SMTV Desk 2017-08-03 17:59:24  Gujarat, Three Rajya Sabha seats, Nota in elections

గుజరాత్, ఆగస్టు 3 : గుజరాత్ లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో నోటా ను ప్రవేశ పెట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటికి ఎదురు దెబ్బ తగిలింది. నోటా అమలు చేయడంపై స్టే విధించాలన్న ఆ పార్టీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే నోటా అమలుకు ఉన్న రాజ్యాంగ అధికారాన్ని పరిశీలించడానికి న్యాయస్థానం అంగీకరించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 8నే రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసిన ఉన్నత న్యాయస్థానం, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన తెలపాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టానికి సవరణలు చేయకుండా రాజ్యసభ ఎన్నికల్లో నోటాను ఎలా ప్రవేశ పెడతారని, కాంగ్రెస్ తమ పిటిషన్ లో ప్రశ్నించగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ఇప్పటికే సమాధానం ఇచ్చింది. 2014 నుంచి నోటాను చేరుస్తున్నారంటూ తెలిపింది. అంతకుముందు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు పై స్పందించిన ఎన్నికల సంఘం కూడా రాజ్యసభ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలనే నిర్ణయం కొత్తగా తీసుకోలేదని 2014 నుంచి అమలు చేస్తున్నట్లు వివరించింది.