ఆ తప్పు మళ్ళీ చేయనంటున్న త్రివిక్రమ్

SMTV Desk 2019-02-26 15:44:37  Trivikram, Allu Arjun, Aravinda Sametha

హైదరాబాద్, ఫిబ్రవరి 26: త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందనే విషయం తెలిసిందే. కథ ఓకే అయినప్పటికీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత ఇటీవల విడుదలై కలెక్షన్లు రాబట్టలేక బోల్తా పడింది. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అరవింద సమేత చిత్రంలో పంచ్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ లేనందున ఆ సినిమాపై విమర్శలు వినిపించాయి.

అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడట. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగేలా స్క్రీన్ ప్లే ను సెట్ చేశాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి బన్నీతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే కసితోనే త్రివిక్రమ్ వున్నాడనిపిస్తోంది. ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్ లో కనిపించనున్నాడని కుడా సమాచారం.