నేడు ఆస్ట్రేలియా మంత్రితో భేటికానున్న ఎంపీ వినోద్

SMTV Desk 2017-06-01 15:33:23  june 2nd telangana celebrations , mp vinodkumar, astrealia,nowsowthwells, melborn chief guest vinodkumar,ceo

హైదరాబాద్, జూన్ 1: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో సందర్బంగా ఎంపీ వినోద్ కుమార్ బుధవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చేరుకున్నారు. వారం రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. గురువారం ఉదయం న్యూసౌత్‌వేల్స్ సాంస్కృతికశాఖ మంత్రి, ఎంపీ, పార్లమెంటు కార్యదర్శితో ఆయన భేతికనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించడానికి ఉన్న అవకాశాలను, ఆ దేశ ప్రభుత్వం నుండి ఆశిస్తున్నట్లు చర్చించనున్నారు. జూన్ 3న ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో, ఆ మరుసటి రోజున మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా టీఆర్ఎస్ విభాగం నిర్వహించే అవతరణ ఉత్సవాల్లో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా రానున్నారు. బుధవారం సిడ్ని చేరుకున్న ఎంపీ వినోద్ కుమార్ కు తెలంగాణ సంఘం ప్రతినిధులు, అక్కడి టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వినోద్ కుమార్ కు స్వాగతం పలికిన వారిలో ఆస్ట్రేలియా టీఆర్ఎస్, ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ సభ్యులు కడారి జైపాల్, గోపు సుమన్, సాగర్ రెడ్డి, గడే ఉపేందర్, అనుగు రమణ, రాపోలు రాజేశ్, కటికనేని మాధవ్, విక్రమ్ , లక్ష్మణ్ తదితరులు తెలంగాణ ఉత్సవాల్లో ఉన్నారు. పర్యటనలో భాగంగా తెలంగాణ పెట్టుబడులు ఆహ్వానించేలా పలు సంస్థలు సీఈవో లతో భేటికానున్నారు.