పార్టీ వీడెందుకు సిద్ధంగా ఉన్న గౌరు దంప‌తులు....

SMTV Desk 2019-02-26 12:54:47  Gowru Charitha Reddy, Venkata Reddy, Jaganmohan Reddy, YCP, Party Changing

అమరావతి, ఫిబ్రవరి 26: ఈమధ్య కలలో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ వలసలు జోరుగా సాగాయి. తెలుగు దేశం పార్టీ నుండి ప్రముఖ నేతలు వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగలనుంది. ఆ పార్టీలో కొంద‌రు మాత్రం అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో వారు కూడా పార్టీ వీడెందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వారిలో ముఖ్యంగా చాలా కాలంగా వైసీపీలో కీల‌క పాత్ర పోషించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రిత రెడ్డి, గౌరు వెంకటరెడ్డిల‌ వ్య‌వ‌హారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గౌరు చ‌రిత రెడ్డి రానున్న ఎన్నికల్లో మరోసారి పాణ్యం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే పాణ్యం టిక్కెట్ కాట‌సాని రాంభూపాల్ రెడ్డికి జ‌గ‌న్ ఖ‌రారు చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా అస‌హ‌నంతో ఉన్న గౌరు దంప‌తులు నేడో, రేపో జ‌గన్‌ను క‌ల‌సి పాణ్యం టిక్కెట్ విష‌యంలో తాడోపేడో తేల్చుకోనున్నారు.