జయరాం హత్య కేసు: మరో కొత్త వ్యక్తి పాత్ర...

SMTV Desk 2019-02-26 12:50:43  Subhash Reddy, Rakesh Reddy, Jayaram, Nagesh, Vishal, Investigation, Murder Case

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మిస్టరీని ఛేదించామని అనుకునేలోపు రోజుకొక మలుపు తిరిగింది. తాజాగా ఈ కేసులో మరో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు. జయరాం హత్య తర్వాత నిందితుడు రాకేశ్ రెడ్డి, మరో వ్యక్తి సుభాష్ రెడ్డికి ఫోన్ చేశాడు. దీంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది.

కాగా సుభాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రాకేశ్‌తో సంబంధాలు, జయరాంతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నగేశ్, విశాల్, సుభాష్ రెడ్డిలను పోలీసులు రేపు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 100 మందిని విచారించారు. నిందితుడికి సహకరించిన పోలీసులపైనా వేటేశారు. బీఎన్ రెడ్డి అనే టీడీపీ నాయకుడిని పోలీసులు రెండో రోజు కూడా విచారించి కొన్ని విషయాలు ఆరా తీశారు.