షూలో పాముతో మహిళ విహార యాత్ర...?

SMTV Desk 2019-02-26 12:49:36  Shoe, Australia, Snake

ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 26: సంతోషంగా విహారయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చిన ఓ మహిళకు షాక్ తగిలింది. మొయిరా అనే మహిళా ఆస్ట్రేలియాలో విహార యాత్రకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాక తన సూట్‌కేసులోని ఓ షూలో దాగిన పామును చూసి అవాక్కయ్యింది. ఆ పాము ఆమెతో పాటు విమానంలో దాదాపు 9 వేల మైళ్ల దూరం ప్రయాణించింది. మోయిరా, క్వీన్స్‌లాండ్‌ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించే అంతసేపు పాము షూలోనే నక్కి ఉండటంతో దాని చర్మపు పై పోర ఉడిపోయింది.

వెంటనే ఆమె జంతు సంరక్షణ సంస్థకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన వారు ఆ పామును షూ నుంచి జాగ్రత్తగా బయటకు తీశారు. అయితే పాము విషపూరితమైన కాదని వారు చెప్పారు.