మరోసారి జనసేనపై దాడి!

SMTV Desk 2019-02-26 12:48:22  Janasena Party, Attack, Flexi, Pawan Kalyan, Chandrasekhar

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీలు జనసేన పార్టీ పై కక్ష కట్టారు. ఈమధ్యే గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. గుంటూరు నగరంలోని జనసేన పార్టీ ఫ్లెక్సీలు, ప్రచార రథాలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. జనసేన అధినేత పవన్ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఆ పార్టీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఫ్లెక్సీలను కూడా ముక్కలుముక్కలుగా చించివేశారు. కాగా, రెండు రోజుల క్రితం కూడా పార్టీ ప్రచార రథాలపై రాళ్ల దాడి జరిగింది.

అయితే ఈ వరుస దాడుల పై పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కొనే సత్తాలేని వాళ్లే ఈ పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పిరికిపంద చర్యలు మానుకోవాలని సూచించారు.