పదేళ్ళ బాలికపై...100 మంది అత్యాచారం

SMTV Desk 2019-02-26 12:47:22  Iraq, IS Terrorist

ఇరాక్, ఫిబ్రవరి 26: ఐఎస్ ఉగ్రవాదుల ఘాతుకానికి పదేళ్ళ చిన్నారి బలయ్యింది. వందమందికి పైగా ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి కారణంగా ఆ చిన్నారి గర్భం కూడా దాల్చింది. ఈ దారుణ సంఘటన ఇరాక్ లో చోటుచేసుకుంది. ఇరాక్ లోని ఐఎస్ ఉగ్రవాదుల పైశాచికత్వానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన ఆ చిన్నారి మేనత్త ఈ ఘటనంకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌లోని సింజార్‌ ప్రాంతంలో ఓకే రోజు ఉగ్రవాదులు దాడి చేసారు. కనిపించిన మగవారినందరినీ చంపేసి, వయసుతో సంబంధం లేకుండా మహిళలందరినీ ఎత్తుకెళ్లారు. తమ స్థావరాలకు చేరుకున్నాక.. అమ్మాయిలను వయసులవారీగా వారిని విభజించారు. పదేళ్ల నుంచి ఇరవైఏళ్ల వరకూ వయసున్న అమ్మాయిలను పై స్థానాల్లో ఉన్న ఉగ్రవాదులు తీసేసుకున్నారు. వారిలో ఆ చిన్నారి కూడా ఒకరు. వారు తమకు తిండి కూడా సరిగా పెట్టేవారు కాదని.. ఆకలిని తట్టుకోలేక జంతువుల పేడ వంటివి తిని ప్రాణాలు నిలుపుకొన్నామని బాలిక మేనత్త తెలిపింది.

ఆడవారిని వారు సెక్స్‌ బానిసల్లా చూసేవారని.. వారి కోరిక తీరగానే జంతువులను అమ్మినట్టు వేరొకరికి అమ్మేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరిసారిగా తన స్నేహితురాలు తన మేనకోడలిని చూసేటప్పటికి ఆమె గర్భం దాల్చిందని ఆమె తెలిపింది. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త సహాయంతో తాను ఆ నరకం నుంచి బయటపడ్డానని.. తన మేన కోడలు మాత్రం ఎక్కడుందో, ఎలా ఉందో తెలియదని ఆవేదన వ్యక్తం చేసింది.