సిపాయిగా కన్పించనున్న రానా

SMTV Desk 2017-08-03 17:48:27  rana, nene raju nene manthri, bahubali, Soldier, leder, subash chandra bose

హైదరాబాద్, ఆగష్టు 3: లీడర్ సినిమాతో తెలుగులో కథానాయకుడిగా పరిచయమైన హీరో రానా, మొదటి సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. తరువాత నేను నా రాక్షసి, నా ఇష్టం, సినిమాలతో కొంచం పరాజయాలు అందుకున్నా, మళ్ళీ బాహుబలి, ఘాజీ చిత్రాల తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అంటూ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం లో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తన నెక్స్ట్ సినిమా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ సైన్యంలోని ఓ సైనికుడి ప్రేమ కథ నేపథ్యంలో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో రానా, నేతాజీ సైన్యంలోని సిపాయిగా కన్పించనున్నారు. ఇది 1945వ సంవత్సరం నాటికి సంబంధించిందట. ఈ సినిమా అప్పటి కాలంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.