ఓవర్సీస్ లో భారీ రేట్ పలికిన గ్యాంగ్ లీడర్

SMTV Desk 2019-02-26 12:06:42  Nani, Gangleader, Overseas market, High rate, Vikram k kumar

సినీ డెస్క్, ఫిబ్రవరి 26: నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాకి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విభిన్నమైన కథాకథనాలతో కొనసాగే ఈ సినిమాలో, నాని డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ కి గల క్రేజ్ కారణంగా, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సరిగమ సినిమాస్ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. ఇందుకోసం వాళ్లు 5 కోట్లను చెల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.