పుట్టిన రోజున నానికి చేదు అనుభవాన్ని మిగిల్చిన అభిమానులు...!

SMTV Desk 2019-02-26 11:58:17  Nani, Gang leader, Vikram Kumar

హైదరాబాద్, ఫిబ్రవరి 26: నేచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఆయన కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భగ్గుమన్నారు. గతంలో యాక్షన్ కింగ్ అర్జున్ టైటిల్ జెంటిల్‌మెన్ పేరుతో వచ్చాడు. నాని ఈసారి మెగాస్టార్ ఎవర్గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ టైటిల్ తో వస్తున్నాడు.

"నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంట్రా? నీకు అంత సీను లేదు.. తెలుగులో గ్యాంగ్ లీడర్ అంటే కేవలం మా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. నువ్వు వెంటనే సినిమా పేరు మార్చుకో.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది.." అని నెటిజన్లు నానిపై విరుచుకుపడ్డారు. ఏకంగా #BoycottNanisGangLeader అనే హాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

దీంతో నాని పుట్టిన రోజు కానుకగా టైటిల్ విడుదల చేస్తే అభిమానులు ఆయనకీ చేదు అనుభవాన్ని మిగిల్చారు. గతంలో మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. చిరంజీవి ఎవర్గ్రీన్ సాంగ్స్, సినిమా పేర్లను వాడుకుంటే మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వివాదంపై నాని ఎలా స్పందిస్తాడో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.