కొలంబో టెస్టులో 13వ సెంచరీ పూర్తి చేసిన పుజారా

SMTV Desk 2017-08-03 17:47:08  cricketer rahane, colombo test match, Ajinkya Rahane 13th century

కొలంబో, ఆగష్టు 3: నేడు కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది. పుజారా, రహానె భాగస్వామ్యం కొనసాగుతున్న సమయంలో ఛటేశ్వర పుజారా వంద పరుగులు పూర్తి చేసి, టెస్టు మ్యాచ్ ల్లో 13వ శతకం సాధించాడు. తన 50వ టెస్టులో సెంచరీ పూర్తి చేసిన ఏడవ భారత బ్యాట్స్‌మేన్ గా పుజారా రికార్డు సాధించాడు. సమయంలో రహానె అర్ధ శతకం సాధించాడు. వీరి భాగస్వామ్యం ఇంకా నిలకడగా ఉంది. కాగా, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అవుట్ అయిన తరువాత, పిచ్‌లోకి దిగిన పుజారా, రహానెలు స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు.