షీఇన్ లోనే షాపింగ్ చేయమంటున్న పాయల్

SMTV Desk 2019-02-26 11:54:51  Shein, Payal rajput, online shopping

హైదరాబాద్, ఫిబ్రవరి 26: ఈ మధ్య కాలంలో అందరూ డిజిటల్ లైఫ్ కు అలవాటు పడటం వల్ల ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే అమేజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ ఆన్లైన్ వెబ్సైట్ దుమ్ము దులిపేస్తున్నాయి. ఇప్పుడు షీఇన్ అనే మ‌రో వెబ్సైట్ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఈ వెబ్ సైట్ ముందే ప్రారభించినప్పటికీ దీని గురించి ఎక్కువగా ఎవరికీ తెలియదు. దాంతో ఇప్పుడు వాళ్లు హీరోయిన్స్ ను ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. ఆర్ ఎక్స్ 100తో సంచలనం సృష్టించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు షీఇన్ అనే వెబ్సైట్ కోసం పని చేస్తుంది. దీనికి ఆన్లైన్ ప్రమోషన్ చేసిపెడుతుంది పాయల్ రాజ్ పుత్.

ఈ వెబ్ సైట్ లో షాపింగ్ చేయండి అంటూ ట్విట్టర్ లో ప్రమోషన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అంతటితో ఆగకుండా తన పేరుతో వచ్చే ఒక కోడ్ కొడితే ఆ కొనే బట్టల్లో డిస్కౌంట్ కూడా వస్తుందని చెబుతుంది. ఇది కూడా ప్రమోషన్ కోసం వాడుకుంటుంది పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మన్మధుడు 2సినిమాలో హీరోయిన్ గా కమిట్ అయ్యింది పాయల్ రాజ్ పుత్. దాంతో పాటు వెంక‌టేష్ వెంకీ మామాలో కూడా న‌టించ‌బోతుంది. మొత్తానికి అటు యాడ్స్.. ఇటు సినిమా రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది ముద్దుగుమ్మ.