ఈ ఏడాది సాధారణ వర్షపాతం

SMTV Desk 2019-02-26 11:50:22  Weather report, Skymate, Farmers

హైదరాబాద్, ఫిబ్రవరి 26: వాతావరణంలో మార్పుల వల్ల సంభవించే అతివృష్టి, అనావృష్టి కారణంగా అనేక మంది రైతులు అప్పుల బారిన పడి, ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాలు పడి పంట మొత్తం పాడై కొందరు, వర్షాలు కురవక పంటంతా ఎండిపోయి అనావృష్టితో ఇంకొందరు రైతులు పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కైమెట్ అనే ఓ సంస్థ ఈ సంవత్సరం సాధారాణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసి, సోమవారం నివేదికను విడుదల చేసింది.

2019 సంవత్సరం వ్యవసాయ రంగం, ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉంటాయని పేర్కొంది. సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం 50 శాతం పైగా ఉండగా.. అధిక వర్షపాతం పడే అవకాశం కొద్దిమేర ఉందని ఆ సంస్థ సీఈవో జతిన్ సింగ్ పేర్కొన్నారు. గత యాభై ఏళ్ల కాలంలో ఖరీఫ్ సీజన్‌లో 89 సెం.మీ. వర్షం కురిస్తే దాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. అదేవిధంగా జూన్‌ నుంచి మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌లోనే 70 శాతం వర్షపాతం కురవడం వల్ల భారత‌దేశం వ్యవసాయ రంగం విజయం సాధిస్తూ వస్తోంది.