ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం, 1000 కిలోల బాంబులను ఉగ్రవాద శిబిరాలపై విడిచిన భారత్

SMTV Desk 2019-02-26 11:47:44  Revenge, Pakisthan, Jaish-e-mahammed, Bomb

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్ ఆక్రమించిన కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దళాలు, యుద్ధ విమానాలతో దూసుకెళ్లి బాంబులేసిన వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, దాదాపు 1000 కిలోల బాంబులను ఈ విమానాలు జారవిడిచాయి. వైమానిక దాడులను నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాశ్మీర్ లోని వైమానిక స్థావరాల నుంచి బయలుదేరిన యుద్ధ విమానాలు, పీవోకేలోకి దూసుకెళ్లి, బాంబుల వర్షం కురిపించాయి. ఈ ప్రతీకారం పట్ల ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.