'శాంతి కావాలంటే దూకుడు తప్పనిసరి': రామ్ దేవ్ బాబా

SMTV Desk 2019-02-26 11:38:21  Baba Ramdev, Pulwama, Terrorist Attack, Revenge

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పుల్వామా ఉగ్రదాడిపై యోగా గురు బాబా రామ్ దేవ్ పాకిస్థాన్ పై మండిపడ్డారు. భారత్ ఓ ప్రశాంతమైన దేశం అని, సున్నితమైన సంస్కృతికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. అలాంటి తమ దేశంపై ఎవరన్నా దాడి చెయ్యాలని చూస్తే వాళ్ల కళ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పాలంటూ బాబా రాందేవ్ కేంద్రానికి సూచించారు.

"యుద్ధం చేయండి... పాకిస్థాన్ ను శుద్ధి చేయండి" అంటూ పిలుపునిచ్చారు. ఢిల్లీలో న్యూ మంత్రాస్ ఫర్ లైఫ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తాను అమాయకులను చంపాలని చెప్పడంలేదని, శాంతికి ముందు విప్లవం తప్పనిసరి అన్నది తన ఉద్దేశమని స్పష్టం చేశారు. "శాంతి కే లియే క్రాంతి జరూరీ హై"(శాంతి కావాలంటే దూకుడు తప్పనిసరి) అంటి తనదైన తీరులో బాబా వ్యాఖ్యానించారు.