కళ్యాణ్ రామ్ సినిమాకి కొత్త టైటిల్ ఇచ్చిన బాలకృష్ణ

SMTV Desk 2019-02-26 11:32:19  Balakrishna, Kalyanram, 118, Pre release event

హైదరాబాద్, ఫిబ్రవరి 25: నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం 118 . ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా పేరును పలుమార్లు తప్పుగా పలికారు. దీంతో అభిమానులు కంగుతిన్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ వెనుక నుంచి బాలయ్యకు సినిమా పేరు చెప్తున్నా ఆయన వినిపించుకోకుండా ప్రసంగాన్ని కోన సాగించారు.

కళ్యాణ్ రామ్ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడని బాలకృష్ణ అన్నాడు. కొత్త వాళ్లకు ఇవ్వడం కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అతడొక్కడే సినిమాను నిర్మించాడని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కోడి రామకృష్ణ మృతికి సంతాపం తెలియజేసారు. ఆయన దర్శకత్వంలో మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు సినిమాలు చేసానని బాలకృష్ణ గుర్తు చేసారు.

అయితే మొత్తానికి బాలకృష్ణ తన ప్రసంగంలో కళ్యాణ్ రామ్ సినిమా పేరును 189 అని పలుమార్లు తప్పుగా పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియోకి విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి.