తొలి మహిళా రాయబారిగా యువరాణి రిమా బింట్‌ బందర్‌

SMTV Desk 2019-02-25 19:08:18  reema bint bandar, Princess Reema bint Bandar its first female ambassador to US, Sultan Al Saud won Arab Sports Personality Award, Dubai

సౌదీ అరేబియా, ఫిబ్రవరి 25: మొట్టమొదటి సారిగా సౌదీ అరేబియా రాజు ఓ మహిళా ప్రతినిధిని అమెరికా రాయబారిగా నియమించారు. దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యువరాణి రిమా బింట్‌ బందర్‌ను తొలి అమెరికా మహిళా రాయబారిగా నియమించారు. జర్నలిస్టు జమాల్‌ ఖస్సోగి హత్య తర్వాత రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నియామకాలు కొంత మైత్రీ బంధం పెంచుతుందని ఆశిస్తున్నారు.

యువరాణి రిమా బింట్‌ బందర్‌ ఇపుడున్న యువరాజు ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ స్థానంలో వస్తున్నారు. యువరారాజు తమ్ముడు అయిన ఖలీద్‌ను ఇపుడురక్షణ శాఖ డిప్యూటి మంత్రిగా నియమించారు. ప్రభుత్వ మీడియాలోనే సౌదీ రాయల్‌ వెలువరించిన ఉత్తర్వులను ప్రసారం చేసాయి. ఖస్సోగి మృతిపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలను సర్దుబాటు చేసుకునేందుకు సౌదీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రయత్నాలను పటిష్టం చేస్తోంది.