భారత్ ను అంతం చేయాలంటే 50 అణుబాంబులు కావాలి : పాక్ మాజీ అధ్యక్షుడు

SMTV Desk 2019-02-25 19:05:08  India vs Pakistan war, Pulwama attack, Anubomb, Pakistan President Pervez Musharraf

దుబాయ్‌, ఫిబ్రవరి 25: పుల్వామా దాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి అని పాక్ మాజీ అధ్యక్షులు పర్వీజ్‌ ముషారఫ్‌ వెల్లడించారు. భారత్ తో యుద్ధంపై స్పందించిన అయన మాట్లాడుతూ మనం ఒక్క అణుబాంబుతో భారత్‌పై దాడిచేస్తే ఆదేశం 20 అణుబాంబులతో తమను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య అణ్వస్త్ర దాడి ఉండబోదని వ్యాఖ్యానించారు.

ఒకవేళ పాకిస్తాన్‌ తొందరపడి భారత్‌పై అణుబాంబు దాడిచేస్తే…భారత్‌ 20 అణుబాంబులతో సర్వనాశనం చేస్తుందని వెల్లడించార. ఇలా జరగకుండా ఉండాలంటే భారత్‌పై 50అణుబాంబులతో దాడి చేయాలి. అప్పుడే భారత్‌ మాపై 20 అనుబాంబులతో దాడిచేయదన్నారు. మీరు 50 అనుబాంబులతో దాడికి సిద్ధమేనా…? అని ముషారఫ్‌ పాక్‌ పాలకులను ప్రశ్నించారు. కాగా, పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాల కోసం ఇజ్రాయెల్‌ ఆసక్తి కనబరుస్తోందన్నారు. ప్రస్తుతం దుబా§్‌ులో ఆశ్రయం పొందుతున్న ముషారఫ్‌ పేర్కొన్నారు.