ఇళ్ళ నిర్మాణాలపై జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు

SMTV Desk 2019-02-25 17:41:51  GST Council, Central minister arun jitly, House constructions

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: జీఎస్టీని భారీగా తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీని ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం నుంచి ఐదు శాతానికి దించుతూ నిర్ణయించింది.
ఇళ్ళ నిర్మాణంలో జీఎస్టీ కౌన్సిల్ తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల కొనుగోళ్లపై
అలాగే చౌక ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీని ఎనిమిది నుంచి ఒక్క శాతానికి తగ్గించిన కౌన్సిల్.. లాటరీలపై విధిస్తున్న శ్లాబ్ తగ్గింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దేశీయ నిర్మాణ రంగం డిమాండ్లు, మధ్య తరగతి వర్గ ప్రజల ఆశలను పరిగణనలోకి తీసుకున్న మండలి.. జీఎస్టీ ఉపశమనం కలిగించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అండర్-కన్‌స్ట్రక్షన్ హౌజింగ్ ప్రాపర్టీలకు 5 శాతం జీఎస్టీనే వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొన్నది.

నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ లేదా రెడీ-టు-మూవ్ ఫ్లాట్ల కోసం చేసే చెల్లింపులపై ప్రస్తుతం 12% జీఎస్టీ పడుతున్నది. అమ్మిన సమయంలో నిర్మాణం పూర్తయిన ధ్రువపత్రం లేనివి కొన్నప్పుడు ఈ ధ్రువపత్రం ఉంటే అంటే పూర్తయిన ఇండ్లపై జీఎస్టీ వర్తించట్లేదు.

నిర్మాణంలో ఉన్న ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ శ్లాబ్ తగ్గింపు.. ప్రత్యేకించి చౌక ఇళ్లపై జీఎస్టీని ఒక శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని స్థిరాస్తి పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. అందుబాటు గృహాలు, ఫ్లాట్లకు జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. కొనుగోలుదార్ల సెంటిమెంట్ మెరుగై గృహాల అమ్మకాలకు ఊతం లభిస్తుందని పేర్కొంది.