ఎన్నికల్లో పోటీ చేయనున్న 'బిగ్ బాస్' - 2 విన్నర్ కౌశల్

SMTV Desk 2019-02-25 16:16:28  kaushal, big boss winner, bigg boss 2

అనకాపల్లి, ఫిబ్రవరి 25: బిగ్ బాస్ షో విన్నర్ కౌశల్ అంటే బహుశా తెలియని వారు ఉండరేమో. బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షోలో మొదటి నుండి చివరి వరకు అందరి ఆదరాభిమానాలు పొందుతూ తన పేరుతో ఫ్యాన్స్ ఆర్మీ ఏర్పరచుకునే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. కౌశల్ ఆర్మీ పేరుతో అతనికి ఒక మినీ సైన్యమే ఉంది.

కాగా కౌశల్ మంద గురించి ఒక పుకారు చక్కర్లు కొడుతుంది.కౌషల్ మంద తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడనీ.. అంతే కాకుండా ఉత్తరాంధ్రా లోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నట్టు సమాచారం.తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నాయకులే ఆసక్తి చూపుతున్నారట.

వారిలానే బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ కూడా అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవమో తెలీదు కానీ ఇది తెలుసుకున్న కౌషల్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.