'కేజీఎఫ్' గురించి కేటీఆర్ ఏమన్నారంటే.....

SMTV Desk 2019-02-25 16:13:03  kgf, ktr, yash, kannada rock star

హైదరాబాద్, ఫిబ్రవరి 25: కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం దక్షిణాది భాషలన్నింటితో సహా హిందీలో కూడా విడుదలై ఘన విజయం సాధించిన సంగత తెలిసిందే. ఈ చిత్రాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షంచారు. సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, "కొద్దిగా ఆలస్యంగానైనా కేజీఎఫ్ చిత్రాన్ని చూశా. వాట్ ఏ మూవీ. టెక్నికల్ గా అద్భుతంగా ఉంది. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రాక్ స్టార్ యష్ నటన అదిరిపోయింది" అంటూ ప్రశంసించారు.

ఈ చిత్రం ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కాగా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.