క్రైమ్: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

SMTV Desk 2019-02-25 16:09:55  All India Trinamool Congress leader karthik dead, Murder

పశ్చిమ బెంగాల్, ఫిబ్రవరి 25: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కార్తీక్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. కార్తీక్ నస్కర్‌ టాంగ్రఖాలి నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అతన్ని అడ్డగించిన కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. వెంటనే అక్కడున్న స్దానికులు కార్తీక్‌ను ఆసుపత్రి నుంచి తరలించేలోపే ఆయన మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కృషన్ గంజ్ తృణమూల్ ఎమ్మెల్యే సత్యజిత్ బిస్వాస్‌ను కొందరు దుండగులు కాల్చి చంపడం సంచలనం కలిగించింది. సొంత గ్రామంలోనే ఆయనను దారుణంగా హతమార్చారు. ఈ కేసులో బీజేపీ నేత ముకుల్ రాయ్‌పై ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.