ముగిసిన సమావేశం - బీసీలపై కీలక నిర్ణయాలు

SMTV Desk 2019-02-25 16:09:55  Andhrapradesh cabinet meetings, tdp, chandrababu, mlc code, bc corporations

అమరావతి, ఫిబ్రవరి 25: ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రమండలి సమావేశం ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఏడు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త నిర్ణయాలు తీసుకోకుండా పాత వాటికే మార్పులు చేర్పులు చేశారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:

* ముదిరాజ్, ముత్రాసి, తెనుగోళ్లు, నగరాలు, నాగవంశ, కల్లు, నీరా కార్పోరేషన్ల ఏర్పాటు

* 13 బీసీ కార్పోరేషన్ల మేనేజింగ్ కమిటీ విధివిధానాల ఖరారు

* యానాదులు, చెంచులు ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీల తరహాలో రాయితీ

* డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

* సింహాచల భూముల అంశంపై న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం ఆదేశం

* ఎక్సైజ్ శాఖలో పోలీసుల పదోన్నతకులకు కేబినెట్ ఆమోద ముద్ర