భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్‌ పురస్కారం!

SMTV Desk 2019-02-25 13:57:36  indian documentary, indian film, period

లాస్ ఏంజెలెస్, ఫిబ్రవరి 25: భారతీయ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేఖ జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ న్యాయనిర్ణేతల మనసు చూరగొని అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో జరుగుతున్న 91వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు సొంతం చేసుకుంది.

భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆడపిల్లలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే పీరియడ్‌ . చిన్న డాక్యుమెంటరీతో భారతీయ చిత్ర పరిశ్రమ కీర్తిప్రతిష్టలను ఆస్కార్‌ వరకు తీసుకు వెళ్లగలిగారు దర్శక, నిర్మాతలు రేకా జెహతాబ్చి, మోంగాలు.

ఏటా ఆస్కార్‌కు పలు భారతీయ చిత్రాలు నామినేట్‌ కావడమే తప్ప అవార్డుకు వచ్చే సరికి నిరాశే ఎదురయ్యేది. అటువంటిది ఓ డాక్యుమెంటరీకి అత్యున్నత పురస్కారం లభించడం చారిత్రాత్మకం. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు.

ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారు’ అన్నదే ఈ డాక్యుమెంటరీ కథ. అవార్డు ప్రకటించగానే......