కొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్న బన్నీ

SMTV Desk 2019-02-25 13:53:17  Allu Arjun, Trivikram, Julayi, New look

హైదరాబాద్, ఫిబ్రవరి 25: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే జులాయి , S/o సత్యమూర్తి వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ మూడో సినిమాతో హాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉంది. నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా ఒక్కటి కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రకటించారు కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

ప్రతీ సినిమాకు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మరింత ఎక్కువ కష్టపడుతున్నారట. ఈ సినిమాలో బన్నీ లుక్ ఒక స్పెషల్ అని వార్తలొస్తున్నాయి. దానికోసం బన్నీ బరువు తగ్గి ఒక కొత్త లుక్ లో దర్శనమివ్వనున్నారని సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకోసమే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఖరారు అయినా సరే బన్నీ లుక్ కోసమే ఇంత కాలం వెయిట్ చేస్తున్నారట. మరి ఈ చిత్రంలో బన్నీ ఎలాంటి స్పెషల్ లుక్ లో కనిపిస్తారో వేచి చూడాలి.