'హ్యారీ పోటర్' సినిమాలో నటించకపోయుంటే బాగుండేది: హీరో డేనియల్ రాడ్ క్లిఫ్

SMTV Desk 2019-02-25 13:49:24  Hollywood, Harry potter, Daniel Radcliffe

హాలీవుడ్, ఫిబ్రవరి 25: హాలీవుడ్ స్టార్ డేనియల్ రాడ్ క్లిఫ్ హ్యారీ పోటర్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ హీరో తాజాగా ఓ కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. హ్యారీ పోటర్ సిరీస్ నుండి తొలిచిత్రం విదుదలైనప్పుడు డేనియల్ ఆనందాన్ని పట్టలేకపోయాడట. ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన గుర్తింపును తట్టుకోలేక బాగా తాగేశానని వెల్లడించాడు.

ఈ కారణంతో విపరీతంగా తాగేవాడట. అలా మందుకి బానిసయ్యాయని చెప్పాడు ఈ నటుడు. దాని నుండి బయట పడడానికి చాలా కాలం పట్టిందని అన్నాడు. కొన్నిసార్లు హ్యారీ పోటర్ సినిమాలో నటించకపోయుంటే బాగుండేదని అనిపించేదని తెలిపాడు.