ఈ ఏడాది ఆస్కార్ విజేతలు వీరే...

SMTV Desk 2019-02-25 13:37:37  Oscar Awards 2019, Winners

అమెరికా, ఫిబ్రవరి 25: ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యున్నతమైన ఆస్కార్ 2019 అవార్డు కోసం ఎన్నో సినిమాలు, నటీనటులు పోటీ పడుతుంటారు. ఈరోజు లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ స్టేడియంలో 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉత్తమ సహాయనటిగా రెజినా కింగ్‌ను ఈ ఏడాది ఆస్కార్‌ వరించింది. ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌ అనే చిత్రంకి గానూ ఆమెకి అవార్డు లభించింది. ఉత్త‌మ స‌హాయ‌న‌టుడిగా మహేర్షలా అలీకు ఈ ఏడాది ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

ఆస్కార్ 2019 విజేతల వివరాలు...

ఉత్తమ సహాయ నటి- రెజీనా కింగ్‌(ఇఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)

ఉత్తమ సహాయ నటుడు- మహేర్షలా అలీ

ఉత్తమ ఛాయాగ్రహకుడు- అల్ఫాన్సో కరోన్‌(రోమా)

ఉత్తమ విదేశీ చిత్రం- రోమా

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం- ఫ్రీ సోలో

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్ - బ్లాక్‌ పాంథర్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ- రోమా

ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైనర్ - రూత్‌కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌)

ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ ఎడిటింగ్ - బెహమైన్‌ రాప్పోడి

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- స్పైడర్‌ మ్యాన్ : ఇన్‌టూ ది స్పైడర్‌ వెర్స్‌