రెమో డైరెక్టర్ తో రష్మిక ...!

SMTV Desk 2019-02-25 13:30:43  Rashmika, Kaarthi, Dear comrade, Bheeshma, Tamil cinema

హైదరాబాద్, ఫిబ్రవరి 25: యంగ్ హీరోయిన్ రష్మిక తెలుగు, కన్నడ సినిమాలలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ , నితిన్ తో భీష్మ సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక తమిళంలో కూడా అడుగు పెట్టడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె కార్తీతో నటించే అవకాశం కొట్టేసింది.

ఇటీవల కార్తి నటించిన దేవ్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోవడంతో, వెంటనే తన తదుపరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కార్తీ రెడీ అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, మార్చి 2వ వారంలో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన రెమో భారీ విజయాన్ని సాధించడం వలన, ఈ ప్రాజెక్టుపై అంచనాలు వున్నాయి. ఈ సినిమా హిట్ అయితే తమిళంలోను రష్మిక బిజీ అవడం ఖాయం.