వర్మ చెవిలో బ్రహ్మం గారి జ్యోష్యం

SMTV Desk 2019-02-25 13:24:03  Ram Gopal varma, Janasena, Pawan Kalyan

హైదరాబాద్, ఫిబ్రవరి 25: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. పోతులూరి వీరబ్రహ్మంగారు పవన్ గురించి తన చెవిలో ఒక విషయాన్ని చెప్పారని ఆయన అన్నారు. "రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిస్తే ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు. తథాస్తు" అంటూ ట్వీట్ చేశారు.