పోలీసులకు చుక్కలు చూపించిన యువతీ

SMTV Desk 2019-02-25 13:19:45  Lady, Drunk and Drive, Breath Analyser

హైదరాబాద్, ఫిబ్రవరి 25: మద్యం సేవించి వాహనం నడుపుతూ ఓ యువతి పోలీసులకు పట్టుబడింది. ఇలా పట్టుబడి బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా చుక్కలు చూపించింది. అరగంటపాటు నానా యాగీ చేసింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో యువత మద్యం అతిగా సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరవ్యాప్తంగా గస్తీ పెంచారు. ఇందులో భాగంగానే పోలీసులు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ యువతి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.

ఆ యువతీ బ్రీత్ ఎనలైజర్ లో గాలి ఊదడానికి కూడా చాలా సేపు పోలీసులకు సహకరించలేదు. మహిళా కానిస్టేబుళ్ల మాటను సైతం ఆమె లెక్కచేయకుండా బ్రీత్ టెస్ట్‌కు ససేమిరా అంది. రోడ్డుపై ఆమె చేసిన హంగామాతో అరగంటపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. చివరికి బలవంతంగా ఆమెకు బ్రీత్ టెస్ట్ నిర్వహించగా మద్యం మోతాదు 44 పాయింట్లు ఉన్నట్టు తేలింది. మరో యువకుడు కూడా ఇలానే బ్రీట్ అనలైజర్ టెస్టుకు నిరాకరించాడు