తాత బాటలోనే మనవడు...!

SMTV Desk 2019-02-25 13:16:41  Naga chaithanya, Vijayendra Prasad, Devadaas

హైదరాబాద్, ఫిబ్రవరి 25: హీరో ఇమేజ్ కి తగ్గట్టు కథ సిద్ధం చేయడంలో విజయేంద్ర ప్రసాద్ నేర్పరి. ఆయన ఒక కథకు రచన చేస్తున్నాడనగానే సహజంగానే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అలాంటి విజయేంద్రప్రసాద్ .. నాగచైతన్య కోసం ఒక ఆసక్తికరమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అక్కినేని నాగేశ్వరావు సూపర్ హిట్ సినిమా దేవదాసు తరహాలో విజయేంద్రప్రసాద్ చైతూ కోసం తయారు చేస్తున్నాడు. విషాదాంతమైన ఈ ప్రేమకథ మనసులను కదిలించే విధంగా వుంటుందని అంటున్నారు. ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయం త్వరలోనే తెలియనుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం వెంకీమామ సినిమా షూటింగులో పాల్గొంటున్న ఆయన, ఆ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే విజయేంద్రప్రసాద్ కథతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.