అయిదుగురు ఆడవాళ్ళకి నాని 'గ్యాంగ్ లీడర్'

SMTV Desk 2019-02-25 12:59:23  Gang Leader, Nani, Mythri Movie Makers, Vikram Kumar, Anirudh

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఇటీవలే నాని జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇష్క్, మనం చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టాడు. అయితే ఆదివారం నాని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నాని కొత్త సినిమా టైటిల్ ను విడుదల చేసింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా గ్యాంగ్ లీడర్ టైటిల్ నే ఈ సినిమాకి ఫిక్స్ చేసారు. ఈ టైటిల్ ను వివరిస్తూ ఒక చిన్న వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేసారు. ఈ వీడియోలో కమెడియన్ సత్య, నాని పాత్ర గురించి వివరిస్తాడు. నాని ఈ సినిమాలో అయిదుగురు ఆడవాళ్ళకు గ్యాంగ్ లీడర్ గా ఉన్నాడని సత్య ఆ వీడియోలో చెప్పాడు.
ఈ సినిమాలో నాని నవలా రచయితగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడు. నాని 24వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.