తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌

SMTV Desk 2019-02-25 12:57:15  Telangana, MLC, Election Commission, Nominations

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ మేరకు రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది.

కాగా నామినేషన్ల దాఖలకు మార్చి 5 తుదిగడువు కాగా, మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మార్చి 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది.