టీచర్ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య...!

SMTV Desk 2019-02-25 12:41:52  Tamilnadu, teacher murder case

తమిళనాడు, ఫిబ్రవరి 25: తమిళనాడులో టీచర్ ని దారుణంగా హతమార్చిన నిందితుడు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. కడలూరు జిల్లాకి చెందినా రమ్య డిగ్రీ పూర్తి చేసి స్థానిక ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పని చేస్తుంది. గతంలో ఆమె క్లాస్ మేట్ అయిన రాజశేఖర్(23) రమ్యను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను అడగగా వారు నిరాకరించడంతో రమ్యను స్కూల్ లో అందరి ముందు దారుణంగా కత్తితో దాడి చేసి చంపేసాడు. ఈ కేసుపై ప్రత్యేక పోలీసు బృందం పోలీసులు రాజశేఖర్‌ సొంత ఊరైన విరుత్తగిరికుప్పం వెళ్లి విచారణ చేశారు.

ఆమెను హత్య చేసిన అనంతరం రాజశేఖర్ అతని సోదరికి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా మెసేజ్ పంపించాడు. రాజశేఖర్‌ సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా అతను దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి రాజశేఖర్‌ తండ్రి అరంగన్నాల్‌ను తమ వెంట తీసుకువెళ్లారు. ఇలా ఉండగా ఉళుందూరుపేట సమీపంలోని తొప్పులాన్‌కుళం జీడితోపులో ఆదివారం రాజేశేఖర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి రాజశేఖరన్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.