తల్లిదండ్రులు ఎంతకీ బయటికి రాకపోవడంతో కూతురు ఇలా చేసింది!!

SMTV Desk 2019-02-25 12:30:46  America, Texas, NRI, Murder

అమెరికా, ఫిబ్రవరి 25: అమెరికాలో ఓ ఎన్ఆర్ఐ దారుణానికి పాల్పడ్డాడు. నకిరేకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి షుగర్ టౌన్‌లో ఓ ఎనర్జీ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆతని భార్య కూడా అదే కంపెనీలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తోంది. వారి మధ్య ఎటువంటి తగాదాలు లేకుండా సంతోషంగానే ఉండేవారు. సోమవారం మధ్యహ్నం కూతురితో కలిసి భోజనం చేసిన ఆ దంపతులు తమ గదిలోకి వెళ్లిపోయారు.

కొంతసేపటికి బెడ్రూమ్ బాల్కనీలో నిలబడ్డ శాంతిని శ్రీనివాస్ అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తనను తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలోకి వెళ్లిన తల్లిదండ్రులు ఎంతకీ బయటికి రాకపోవడం వారి కుమార్తెకు అనుమానం కలిగింది. సాయంత్రం వరకూ ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో భయపడింది.

గట్టిగా తలుపులు కొట్టినా.. కేకలు వేసినా లోపల్నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకుని.. శ్రీనివాస్ దంపతుల గది తలుపులు బద్దలు కొట్టారు.

లోపల ఆ దంపతుల మృతదేహాలు కనిపించేసరికి అందరు షాక్ తిన్నారు. శ్రీనివాస్ మృతదేహం పక్కనే ఓ హ్యాండ్‌గన్ కూడా కనిపించింది. ఈ కేసును మర్డర్-సూసైడ్‌గా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అనుమానితులెవరూ లేరని చెప్పారు.

ఆ రోజు ఉదయం శ్రీనివాస్ నుంచి తమకు కొన్ని మెయిల్స్ వచ్చాయని, అయితే ఆ వివరాలు బయటకు వెల్లడించవద్దని పోలీసులు చెప్పినట్లు శ్రీనివాస్ మిత్రులు తెలియజేశారు. శ్రీనివాస్ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉండాలని, అతనేమయ్యిందీ తెలియడం లేదని వారు చెప్పారు.