తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రకి బయోపిక్‌ లు రెండా?

SMTV Desk 2019-02-25 12:26:45  Jayalalitha, Biopic, Nithya Menon, AL Vijay, Thalaivi

తమిళనాడు, ఫిబ్రవరి 25: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఒక చిత్రం ప్రియదర్శిని దర్శకత్వంలో నిత్యామీనన్ ప్రధాన పాత్రలో ఐరన్ లేడీ పేరుతో రూపొందుతుంది. ఇక మరి బయోపిక్‌కు ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం జయలలిత జీవిత చరిత్రపై దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన పరిశోధన జరిపారు. నిన్న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. విష్ణువర్ధన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తలైవి అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.