మందు కోసం ఐడీ కార్డును టాటూగా వేసుకున్నాడు మద్యం ప్రియుడు....!

SMTV Desk 2019-02-23 19:35:20  Ho Chi Minh City, ID Card tattoo, Vietnam, tattoo

హోచిమిన్హ్, ఫిబ్రవరి 23: హోచి మిన్హ్ నగరానికి చెందిన ఓ యువకుడుమద్యం తాగడానికి తన వయసు, ఇతరత్రా నిర్ధారణ కోసం ఏకంగా ఐడీ కార్డునే టాటూగా వేయించుకున్నాడు. పూర్తి వివరాల ప్రకారం ఓ యువకుడు తరచూ తన ఐడీ కార్డును మర్చిపోతూ ఉంటాడు. ఎప్పుడైనా పోలీసులు చెక్ చేసినా, లేక బార్ షాపు వాళ్లు పరిశీలించినప్పుడు ఐడీ కార్డు లేకపోవడంతో చాలాసార్లు సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో అతడు విసిగిపోయి తన ఐడీ కార్డును అతనా చేతి మీద టాటూగా వేయిన్చుకున్నాడు. ఇక అతన్ని ఎవరు, నీ వయసెంత, నీకు మద్యం విక్రయించేందుకు చట్టం అనుమతించదు లాంటి సమాధానాలు రావని ఊహించుకున్నాడు. టాటూ వేసిన వ్యక్తి నుయెన్ వాన్ తియెన్ దాయ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని యువకుడికి సూచించాను. కానీ అతడు టాటూ వేయాల్సిందేనని పట్టుబట్టడంతో ఐడీ కార్డును టాటూగా మలిచాను. అయితే టాటూ అతడికి బార్స్, రెస్టారెంట్లు, నైట్ క్లబ్బులలో వర్క్ అవుతుందే లేదోనని’ అనుమానం వ్యక్తం చేశాడు. టాటూ వేయించుకోవడానికి కారణాన్ని చాలా మంది నెటిజన్లు తప్పుపడుతున్నారు. టాటూ వేసిన వ్యక్తిని కొందరు విమర్శిస్తున్నారు. టాటూ ఐడీ కార్డులా లేదని సైతం కామెంట్లు వస్తున్నాయి. టాటూ కారణంతో పాటు ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.