రానా సరసన సాయి పల్లవి

SMTV Desk 2019-02-22 15:45:05  Sai Pallavi, Rana, Venu Udugula, Virata Parvam 1992

హైదరాబాద్, ఫిబ్రవరి 22: రానా దగ్గుబాటి ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ మధ్య వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా నటించాబోతున్నాడని వార్తలు వినిపించాయి. తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడలేదు. అయితే తాజాగా రానా ఈ సినిమాపై క్లారిటీ ఇస్తూ....తాను వేణు ఊడుగుల దర్శకత్వంలో త్వరలో సినిమా చేయనున్నానని, అందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని స్పష్టం చేసాడు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రానా చెప్పాడు. ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటించగా సాయి పల్లవి ఒక నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా కోసం విరాట పర్వం 1992 అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదని రానా అన్నారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.