శాంసంగ్ నుంచి 3 కొత్త ఫోన్లు..

SMTV Desk 2019-02-21 20:09:33  samsung galaxy, galaxy s10e, galaxy s10, galaxy s10+, samsung

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఫోన్ల తయారీ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ కొత్త మోడల్స్ రిలీజ్ చేయటంలో తన ప్రత్యేకను చాటుకుంది. శాంసంగ్ కంపెనీ తాజాగా మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎస్10ఇ, ఎస్10, ఎస్10 ప్లస్‌ పేరుతో స్మార్ట్‌ఫోన్లను గ్లోబల్‌గా లాంచ్‌ చేసింది. తొలిసారిగా డిస్‌ప్లేలోనే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, పంచ్ హోల్ ఇన్‌స్క్రీన్ డిస్‌ప్లేలు గెలాక్సీ ఎస్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.

➤ గెలాక్సీ ఎస్10 :

ఆండ్రాయిడ్‌ 9.0 పై
6.1 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోల్డ్ కర్వ్‌డ్ స్క్రీన్
8 జీబీ ర్యామ్, 512 వరకు మెమరీ
10 ఎంపీ ఫ్రంట్ కెమెరా
16 +12 +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రారంభ ధర రూ.64,000


➤ గెలాక్సీ ఎస్10 ప్లస్ :

ఆండ్రాయిడ్‌ 9.0 పై
6.4 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్
12+12+16 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
12 జీబీ ర్యామ్, 1 టెరాబైట్ స్టోరేజ్
10+8 ఎంపీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రారంభ ధర రూ.71,000


➤ గెలాక్సీ ఎస్10ఈ :

ఆండ్రాయిడ్‌ 9.0 పై
5.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్‌
10ఎంపీ సెల్ఫీ కెమెరా
16+12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
6/8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌
3100 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రారంభ ధర రూ.53,000