యూఎస్ ను భయపెడుతున్న కొత్త వ్యాధి

SMTV Desk 2019-02-21 20:00:47  

ప్రపంచం లో అగ్రరాజ్యం ఐన అమెరికాను ప్రస్తుతం భయంకరమైన కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు జొంబీ డీర్. వన్య ప్రాణులైన జింకలు, దుప్పులలో ఈ వ్యాధి విస్తృతంగా ప్రభలిస్తుంది . ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు . దీంతో, అమెరికా ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది.

ఏ నేపథ్యం లో ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ సోకగానే దాని లక్షణాలు వెంటనే బహిర్గతం కావు. శరీరం మొత్తం వైరస్ విస్తరించిన తర్వాత కానీ వ్యాధి సోకినట్టు మనకు అర్థం కాదు. ఇదే ఇప్పుడు అంత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం. అమెరికాలోని 24 రాష్ట్రాలతో పాటు... రెండు కెనెడియన్ ప్రావిన్స్ లలో కూడా ఈ వ్యాధి వ్యాపించినట్టు అధికారులు తెలిపారు.ఈ వైరస్ సోకగానే నోటి నుంచి చొంగ కారడం, దప్పిక వేయడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరోవైపు ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.